సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’

Actor Satyadev New Movie Uma Maheswara Ugra Roopasya Movie Completes Censor Scrutiny
Actor Satyadev New Movie Uma Maheswara Ugra Roopasya Movie Completes Censor Scrutiny

మొదటి నుండి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య దేవ్. ఇటీవలే జార్జిరెడ్డి సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సత్యదేవ్‌ తాజాగా మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. 2016లో విజయం సాధించిన మలయాళ చిత్రం ‘మహేషింటే ప్రతీకారమ్‌’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. కేరాఫ్‌ కంచరపాలెం లాంటి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన వెంకటేశ్‌ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని వెంకటేశ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఈ సినిమా చూడడానికి ఎటువంటి నియంత్రణలు లేకుండా సెన్సార్ వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా దర్శకుడు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనాతో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే.

కాగా ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో నరేశ్‌, సుహాస్‌, జబర్దస్త్‌ రామ్‌ ప్రసాద్‌, టీఎన్‌ఆర్‌, రవీంద్ర విజయ్‌, రాఘవన్‌ ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన బిజిబల్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =