“భారతీయుడు 2 “సెట్స్ లో భారీ ప్రమాదం

Mishap On The Sets Of Indian 2

భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరో గా రూపొందిన “ఇండియన్ “(భారతీయుడు ) ఘనవిజయం సాధించింది. ఆ మూవీ సీక్వెల్ “ఇండియన్2″(భారతీయుడు 2) రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, సిద్ధార్ధ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

నిన్న (19 వ తేదీ ) రాత్రి “భారతీయుడు 2 “సెట్స్ లో ఘోర ప్రమాదం సంభవించింది. చెన్నై లోని EVP స్టూడియో లో షూటింగ్ కై ఏర్పాట్లు జరుగుతుండగా 150 అడుగుల ఎత్తు నుండి క్రేన్ తెగి కింద ఉన్న టెంట్ పై పడటం తో డైరెక్టర్ శంకర్ అసిస్టెంట్ మధు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వారిలో డైరెక్టర్ శంకర్ కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు హీరో కమల్ హాసన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్,సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ , చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 1 =