నానికి అన్నయ్యగా..?

Jagapathi Babu To Play Nani Brother Role

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ తో ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో నాని ఐదుగురు అన్నదమ్ముల్లో ఒకడిగా కనిపించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…నానికి అన్నయ్యగా నటుడు జగపతిబాబు నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో కీలకమైన హీరో అన్నయ్య పాత్రలో జగపతిబాబును తీసుకున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

ఇదిలా ఉండగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ V మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =