ట్యాగ్ · 2 కథనాలు
అలీ నిర్మాణ సంస్థ 'అలీవుడ్'
ఆ ఇద్దరి రుణం తీర్చుకోలేనిది - అలీ
వెండితెరపై బాలనటుడిగా.. హీరోగా.. కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన అలీ ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. అలీ నిర్మాతగా అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాం పై తెరకెక్కుతున్న చిత్రం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. అలీ, నరేష్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.
అలీ నిర్మాణ సంస్థ 'అలీవుడ్'
'అలీవుడ్' ఇదేంటి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా హాలీవుడ్ వరకు విన్నాం కదా.. ఇదేం వుడ్ అబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... ప్రముఖ కామెడీ హీరో, హాస్యనటుడు అలీ కూడా ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరే అలీవుడ్. అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఆయన ఈ సంస్థను ఏర్పాటుచేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, ప్రొడ్యూసర్ జయచంద్ర, అలీ బ్రదర్ ఖయ్యూం, హీరో రవివర్మ ఇతర సినిమా ప్రముఖులు విచ్చేసి లోగో ఆవిష్కరించారు.