`వెంకి మామ`, `ప్రతి రోజూ పండగే`… వారం గ్యాప్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఇవి. ఈ నెల 13న `వెంకి మామ` రిలీజ్ కాగా, 20న `ప్రతి రోజూ పండగే` జనం ముందుకొచ్చింది. రెండు చిత్రాలకూ కుటుంబ ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోంది. విశేషమేమిటంటే… ఈ రెండు సినిమాల్లోనూ అందాల తార రాశీఖన్నా నాయికగా నటించగా… యువ సంగీత సంచలనం థమన్ బాణీలను అందించాడు. అంటే… అటు రాశి, ఇటు థమన్ ఇద్దరికీ బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో రెండు వరుస విజయాలు దక్కాయన్నమాట. రెండు వరుస వారాల్లో సినిమాలు విడుదలవడమే ఒక విశేషమైతే… ఆ యా చిత్రాలతో విజయాలు చూసి `టాక్ ఆఫ్ టాలీవుడ్` అయ్యారు రాశి, థమన్. మరి… వచ్చే ఏడాదిలో వీరి హవా ఎలా సాగుతుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























