`హనీ ఈజ్ ద బెస్ట్` అంటూ ఈ సంక్రాంతికి `ఎఫ్ 2` రూపంలో సెన్సేషనల్ హిట్ ని మూటగట్టుకుంది పంజాబీ జాబిలి మెహరీన్. ఇక దసరాకి వచ్చిన `చాణక్య` ఆశించిన విజయం సాధించకపోయినా… నటిగా తనకి మంచి గుర్తింపునే తీసుకువచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… 2020లో మొదటి నెల(జనవరి)లోనే ముచ్చటగా మూడు సినిమాలతో సందడి చేయబోతోంది మెహరీన్. ఆ వివరాల్లోకి వెళితే… జనవరి 15న మెహరీన్ నాయికగా నటించిన తెలుగు చిత్రం `ఎంత మంచివాడవురా` (కళ్యాణ్ రామ్ హీరో) విడుదల కానుండగా, ఆ నెక్స్ట్ డే అంటే జనవరి 16న తమిళ సినిమా `పట్టాస్` (ధనుష్ కథానాయకుడు) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నెలాఖరులో అంటే జనవరి 31న మరో తెలుగు మూవీ `అశ్వథ్థామ` (నాగశౌర్య హీరో) రిలీజ్ కానుంది. మరి… ఒకే నెలలో మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో పలకరిస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఆ యా చిత్రాలతో ఏ స్థాయి విజయాలు అందుకుంటుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























