
ట్యాగ్ · 3 కథనాలు


యాత్ర నుండి నీ రాక కోసం వీడియో సాంగ్ రిలీజ్
మహి. వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు. ఇక వైసీపీ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ రాజన్నను చూసినట్టే ఉందని సినిమా చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.

యాత్ర మూవీ - మరుగైనావ రాజన్న లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
మహి వి రాఘవ్ దర్శకత్వంలో.. రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్, సమర శంఖం, రాజన్న నిన్నాపగలరా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

యాత్ర నుండి రాజన్నా నిన్నాపగలరా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వై.ఎస్ పాదయాత్ర ముఖ్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా..ఇప్పటికే మమ్ముట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందరూ ఫిదా అయిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.