
ట్యాగ్ · 5 కథనాలు


సాయి పల్లవి తప్ప ఎవరూ చేయలేరు..!

'విరాట పర్వం' ట్రైలర్ రిలీజ్

ముందే వచ్చేస్తున్న 'విరాట పర్వం'

'విరాటపర్వం' గొప్ప ప్రేమ కావ్యం..!
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, న్యాచురల్ పెర్ఫార్మర్ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ వరంగల్ లో ఆత్మీయ వేడుక నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సాయి పల్లవి తప్ప ఎవరూ చేయలేరు..!
వేడు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న సినిమా విరాటపర్వం. కాస్త డిఫరెంట్ కథతో వస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండి అందరికీ ఆసక్తి ఉంది. అందులోనూ రానా, సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో ఖచ్చితంగా ఈసినిమా విభిన్నంగా ఉంటుందని ఫిక్స్ అయ్యారు అందరూ. ఇక ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈసినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ముందు జులై 1వ తేదీన రిలీజ్ డేట్ ను ప్రకటించి ఆ తర్వాత ప్రీ పోన్ చేశారు. ఫైనల్ గా ఈనెల 17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో రిలీజ్ కు ఇంకా చాలా తక్కువ టైమ్ ఉండటంతోప్రమోషన్స్ మాత్రం బాగానే చేస్తున్నారు. మరోవైపు ఈసినిమా నుండి…

'విరాట పర్వం' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న సినిమా విరాటపర్వం. ఇద్దరు టాలెంటెడ్ నటీనటుల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భాపీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కూడా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. మధ్యలో ఈ సినిమా మీద ఎన్నో రూమర్లు కూడావచ్చాయి. ఓటీటీలో వస్తుందంటూ రకరకాల పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. అయితే థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమా మాత్రం జూన్ 17న థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసేశారు.

ముందే వచ్చేస్తున్న 'విరాట పర్వం'
వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక రిలీజ్ కు రెడీ అవుతుండగా మధ్యలో కరోనా వచ్చింది. కరోనా వల్ల చాలా కాలం ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత కరోనా తగ్గినా తరువాత కూడా రిలీజ్ మంచి సమయం కుదర్లేదు. మధ్యలో ఓటీటీ లో రిలీజ్ అవుతుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. అది కూడా అవ్వలేదు. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను జులై 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను మరోసారి మార్చారు మేకర్స్. అయితే ఈసారి రిలీజ్ డేట్ ను కాస్త ముందుకు తీసుకొచ్చారు…

'విరాట పర్వం'.. ఒక సీన్ కోసం సాయిపల్లవి రోజంతా తినలేదు..!
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో సాయి పల్లవి మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎలాంటి పాత్రలు చేశాము.. ప్రేక్షకులకు గుర్తుండే పాత్రలు ఎన్ని చేశాము అన్నది మాత్రమే చూస్తుంది. అందుకే ఇండస్ట్రీలో సాయి పల్లవి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. యూత్ లో మంచి క్రేజ్ ను కూడా సొంతం చేసుకుంది. సాయి పల్లవి నటన ఒక ఎత్తైతే.. తన డ్యాన్స్ మరో ఎత్తని చెప్పొచ్చు. తన డ్యాన్స్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో కూడా తెలిసిందే. ప్రస్తుతం అయితే పలు సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉంది.