
ట్యాగ్ · 4 కథనాలు


నితిన్ మూవీ వేరే లెవల్ లో ఉంటుంది

అఫీషియల్.. వెంకీ కుడుములతో 'చిరు' సినిమా
మైత్రీ మూవీ మేకర్స్‌తో వెంకీ కుడుముల?

రాబిన్‌హుడ్‌లో ఆయన ఎంట్రీకి థియేటర్ అదిరిపోయింది
హీరో నితిన్ సమ్మర్ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

నితిన్ మూవీ వేరే లెవల్ లో ఉంటుంది
తమ అభిమాన హీరోల సినిమాల గురించి ఫ్యాన్స్ డైెరెక్టర్ లనే డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా అడిగేస్తుంటారు. కొంతమంది అయితే వారికి రిప్లైలు కూడా ఇస్తుంటారు. ఇక ఇప్పుడు వెంకీ కుడుములకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. వెంకీ కుడుముల, నితన్, రష్మిక కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాపై కూడా ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి.

అఫీషియల్.. వెంకీ కుడుములతో 'చిరు' సినిమా
మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. రీఎంట్రి తరువాత మాత్రం వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉండగా ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. గతకొద్ది రోజులుగా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో చిరు సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆవార్తలను కన్ఫామ్ చేస్తూ అఫీషియల్ ప్రకటన వచ్చింది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై ఈసినిమా తెరకెక్కుతుండగా ఆ నిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీనికి సహ నిర్మాత గా డా. మాధవి రాజు వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని…
మైత్రీ మూవీ మేకర్స్‌తో వెంకీ కుడుముల?
`ఛలో`(2018) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు వెంకీ కుడుముల. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ని అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్... ప్రస్తుతం యువ కథానాయకుడు నితిన్‌తో `భీష్మ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోపే... తన మూడో చిత్రాన్ని పట్టాలెక్కించే దిశగా ప్రణాళిక రచిస్తున్నాడట వెంకీ.