ట్యాగ్ · 83 కథనాలు · పేజీ 5

సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

సొంత కుంపటినే నమ్ముకుంటున్న మన హీరోలు
గీతాంజలి మృతికి కృష్ణంరాజు సంతాపం
ప్రముఖ నటి గీతాంజలి మృతి పట్ల సుప్రసిద్ధ కథానాయకులు రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు." ఒక సహనటిగా గీతాంజలి నాకు సుపరిచితురాలు. ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఎన్టీ రామారావు గారి " సీతారామ కళ్యాణం " తో పరిచయమైన గీతాంజలి హీరోయిన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ నటిగా వందలాది పాత్రల్లో నటించి మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపుపొందారు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యక్రమాలలో కూడా చాలా ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఆమె మరణంతో నేను వ్యక్తిగతంగా ఒక మంచి స్నేహితురాలిని , చిత్ర పరిశ్రమ ఒక మంచి నటిని కోల్పోయినట్లు అయింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి…

సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత
ఇప్పటికే ఎంతో మంది పెద్ద దిక్కును కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మరో పెద్ద దిక్కును కోల్పోయింది. పాతతరం నటీనటుల్లో ఇప్పటికే ఎంతోమంది దివికెగిశారు. ఈ రోజు సీనియర్ నటి గీతాంజలి(62)కన్నుమూశారు. నిన్న ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించారు. అయితే ఆమెకు రాత్రి మరోసారి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఇక గీతాంజలి మృతి పట్ల తెలుగు సినీపరిశ్రమ సంతాపం తెలియస్తుంది. పలువురు సినీ ప్రముఖులు నందినగర్‌లోని గీతాంజలి నివాసంలోఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

సొంత కుంపటినే నమ్ముకుంటున్న మన హీరోలు
ఒకప్పుడు డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేసేవాడు, హీరో నటించేవాడు, ప్రొడ్యూసర్ సినిమాని నిర్మించేవాడు. అయితే అప్పుడప్పుడు హీరోహీరోయిన్లు మెగా ఫోన్ పట్టుకునేవాళ్ళు. తమ సినిమాలు తాము నిర్మించుకునేవాళ్ళు. కానీ ఆ సంప్రదాయం తక్కువగానే ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సినీ పరిశ్రమలో. ఇప్పుడున్న యంగ్ హీరోలు మాత్రం ఒకటి రెండు సినిమాలకే సొంత ప్రొడక్షన్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది హీరో లు తమ సినిమాలు తామే నిర్మించుకుంటున్నారు. సినిమా హిట్ అయిందంటే హీరోలకి కాసుల వర్షమే. మరి అలా మన యంగ్ హీరోలు ఎవరు తమ ప్రొడక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నారో చూద్దాం.