కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Movie Updates This Week

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

ఈవారం టాలీవుడ్ లేటెస్ట్ అప్ డేట్స్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ సినిమాను ఆహా లో అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేశారు. థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఓటీటీ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ థియేటర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం థియేటర్స్ ‌ తెరచుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేట‌ర్‌ల‌లో కూడా విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల‌ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు , హిందీ భాషలలో యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "ఫైటర్ " మూవీ లోని తన పాత్రకై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ముంబై లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న "ఫైటర్ " మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మళ్లీ ప్రభాస్ తో సినిమానా - ఇక చాలు

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు అవి. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది.

TFN Adminవాట్సాప్

షేర్