
ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 18


రోబో సుందరి నిశ్చితార్ధం

భారతీయుడు 2 అప్ డేట్ - రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్

ప్రభాస్ తో ముచ్చటగా మూడోసారి?
ప్రముఖ నిర్మాత `దిల్` రాజు... దాదాపు అగ్ర హీరోలందరితోనూ సినిమాలను నిర్మించారు. ఈ కథానాయకులలో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. వీరిద్దరి తొలి కాంబినేషన్ మూవీ `మున్నా` ఆశించిన విజయం సాధించకపోయినా... రెండో చిత్రం `Mr. పర్‌ఫెక్ట్` బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలచింది. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత ఈ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే... కన్నడంలో రూపొంది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్బింగ్ అయిన `కేజీఎఫ్`... ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి…

రోబో సుందరి నిశ్చితార్ధం
బ్రిటిష్ యాక్ట్రెస్, మోడల్ అమీ జాక్సన్ మదరాసపట్టినం మూవీ తో హీరోయిన్ గా కోలీవుడ్ లో ప్రవేశించారు. బ్లాక్ బస్టర్ మూవీ ఎవడు మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అమీ జాక్సన్ నటించిన తమిళం లో ఐ, తెరి, 2.0, హిందీలో సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలు ఘన విజయం సాధించాయి. కన్నడం లో టాప్ స్టార్స్ శివరాజ్ కుమార్,సుదీప్ లు నటించిన ది విలన్ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించారు.

భారతీయుడు 2 అప్ డేట్ - రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్
గతంలో శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘భారతీయుడు’ సినిమాలో తండ్రీ కొడుకులుగా కమల్ హాసన్ నటనను ఎవరు మరిచిపోలేదు. అవినీతి, లంచగొండి తనానికి వ్యతిరేకిగా.. కమల్ హాసన్ ముసలివాడి పాత్రలో చేసిన నటన పీక్స్. ఈ మూవీ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.