ట్యాగ్ · 5 కథనాలు
తమిళ్ లో మరో భారీ ఆఫర్ కొట్టేసిన థమన్..!
`యన్టీఆర్ 30`కి థమన్ బాణీలు?

మరోసారి వారం గ్యాప్ లో థమన్ చిత్రాలు
'లూసిఫర్' మ్యూజికల్ జర్నీ స్టార్ట్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే చెప్పే పేరు థమన్. ప్రస్తుతం థమన్ క్రేజ్ మాములుగా లేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ దాదాపు థమన్ ఖాతాలనో ఉన్నాయి. అసలే ఫుల్ డిమాండ్ లో ఉన్న థమన్ ను అల వైకుంఠపురములో ఆల్బమ్ థమన్ స్థాయిని మరింత పెంచింది. అందరు దర్శక నిర్మాతలు థమన్ వైపే చూసేలా చేసింది ఆ సినిమా. ఇక ప్రస్తుతం ఎలా లేదనుకున్న థమన్ ఓ అరడజను సినిమాలకు పైనే పని చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసాడు.
తమిళ్ లో మరో భారీ ఆఫర్ కొట్టేసిన థమన్..!
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు థమన్. ఈ మధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో ' సినిమా ఆడియోకు మంచిపేరు రావడంతో థమన్ కు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్" సోలో బతుకే సో బెటర్", రవితేజ మూవీ "క్రాక్", కీర్తి సురేష్ "మిస్ ఇండియా" , నాని "టక్ జగదీష్", వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. వాటితో పాటు వి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇంకా సెట్స్ పైకి రాని సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB 27, యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు కూడా థమన్ ను అనుకుంటున్నారు.

మేలో వరుసగా మూడు వారాల పాటు థమన్ సందడి
వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచలనం థమన్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్న థమన్.. ఈ వేసవిలో వరుస చిత్రాలతో సందడి చేయనున్నాడు. మరీ ముఖ్యంగా.. మే నెలలో వరుసగా మూడు వారాల పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పలకరించనున్నాడు.
`యన్టీఆర్ 30`కి థమన్ బాణీలు?
`వెంకి మామ`, `ప్రతి రోజూ పండగే`, `అల వైకుంఠపురములో`... ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచలనం థమన్. మరీ ముఖ్యంగా.. `అల వైకుంఠపురములో`తో స్వరకర్తగా మరో స్థాయికి ఎదిగాడు ఈ టాలెంటెడ్ కంపోజర్. కట్ చేస్తే... `అల వైకుంఠపురములో` నిర్దేశకుడు, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న కొత్త చిత్రానికి కూడా బాణీలు అందించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడట థమన్.

మరోసారి వారం గ్యాప్ లో థమన్ చిత్రాలు
వరుస విజయాలతో నంబర్ వన్ మ్యూజిక్ కంపోజర్ గా దూసుకుపోతున్నాడు యువ సంగీత సంచలనం థమన్. తాజాగా `వెంకి మామ`, `ప్రతీ రోజూ పండగే`, `అల వైకుంఠపురములో`తో హ్యాట్రిక్ కొట్టిన థమన్.. ఈ ఏడాది పలు చిత్రాలతో సందడి చేయనున్నాడు. మరీ ముఖ్యంగా... వేసవిలో రెండు వరుస వారాల్లో కొత్త చిత్రాలతో సందడి చేయనున్నాడు.