
ట్యాగ్ · 4 కథనాలు


థియేటర్స్ మూసివేత పై తలసాని క్లారిటీ
సినీ కార్మికులకు అండగా ప్రభుత్వం

అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న మెగా స్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధారణ చేసి శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేవారని చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పుడు కాకపోయినా కొన్నేళ్ళ కింది వరకూ రెగ్యులర్గా చిరు మాల వేసుకునేవాళ్ళు. వరస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కూడా చిరు అయ్యప్పమాల ధారణ చేసిన సందర్భాలున్నాయి. తండ్రి చిరంజీవి మాదిరే రామ్ చరణ్ కూడా ప్రతీ ఏటా అయ్యప్ప మాల ధరిస్తున్నారు. ప్రతీసారి నవంబర్లో మాల ధారణ చేసే రామ్ చరణ్.. ఈ సారి మాత్రం శంకర్ సినిమా కోసం కాస్త ముందుగానే మాల వేసుకున్నారు.

థియేటర్స్ మూసివేత పై తలసాని క్లారిటీ
మళ్లీ కరోనా కేసులు ఎక్కువవడంతో సినిమా ఇండస్ట్రీలో కూడా భయం మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే గత ఏడాది మొత్తం షూటింగ్ లు, థియేటర్లు లేక సినీ ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది. రెండు మూడు నెలల క్రితమే థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. అందులోనూ ఇప్పుడిప్పుడే కాస్త థియేటర్లకి జనాలు వస్తున్నారు. మరోవైపు పెండింగ్ లో ఉన్న సినిమాలను కూడా వరుసపెట్టి రిలీజ్ చేసేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఒక్కో వారం రెండు, మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నారు. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలు మూసేశారు.
సినీ కార్మికులకు అండగా ప్రభుత్వం
లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు ఆగిపోవడంతో ఎంతోమంది సినీ కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక వారికి సాయంగా ఎంతోమంది సెలబ్రిటీస్ ముందుకు వచ్చి పెద్దఎత్తున విరాళాలు కూడా అందించారు. వాళ్లకు నిత్యావసరాలను కూడా అందిచారు. కేవలం టాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కాదు... కోలీవుడ్ నుండి.. బాలీవుడ్ నుండి కూడా పలువురు మన సినీ కార్మికులకు సాయం అందించారు. మరో వైపు చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా అనేక సేవా కార్యకమాలు చేపడుతూనే వున్నారు.

ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుంటుంది.. తలసాని శ్రీనివాస్ యాదవ్
ఈ కరోనా కష్టకాలంలో ఎవరు పలకరించినా ఏదో తెలియని ఊరడింపు పొందిన భావన కలుగుతుంది. ముఖ్యంగా కరోనా కరాళ నృత్యం చేస్తూ ప్రపంచాన్నే దిగ్బంధనం చేసిన విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి పలకరింపు కోసం పరితపిస్తున్న నేపథ్యంలో "మీకోసం నేను ఉన్నాను... మా ప్రభుత్వం ఉంది" అనే భరోసా ఇస్తూ రాష్ట్ర మంత్రి పలకరిస్తే ఎంతో ఊరటగా అనిపిస్తుంది కదూ... చిత్ర పరిశ్రమకు అలాంటి ఊరటను, భరోసాను ఇవ్వటం కోసం తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖమాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకు వచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర సినీ సంబంధిత మంత్రులు చేయని విధంగా కష్టకాలంలో సినిమా పరిశ్రమను పలకరించిన ఏకైక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే…