
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2


ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో సుధీర్ బాబు

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
థియేటర్లు ఓపెన్ అవ్వడంతో హీరోలందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక యంగ్ హీరో సుధీర్ బాబు కూడా శ్రీదేవి సోడా సెంటర్ తో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబుగా , ఆనంది శ్రీదేవిగా కనిపించబోతున్నారు. ఆగష్ట్ 27న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ అన్నీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలను కూడా పెంచేసాయి.

శ్రీదేవి సోడా సెంటర్.. శ్రీదేవి ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్
పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలాగే సుధీర్ బాబు ఇంట్రడక్షన్ వీడియో ను కూడా రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ లో ఉన్న సోడా సెంటర్ శ్రీదేవి ఎవరు అన్నది ఇప్పుడు మేకర్స్ రివీల్ చేశారు.

ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో సుధీర్ బాబు
యాక్షన్ థ్రిల్లర్ "V"మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సుధీర్ బాబు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "పలాస 1978"మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు కథానాయకుడిగా "శ్రీదేవి సోడా సెంటర్ "మూవీ తెరకెక్కుతుంది.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.