
ట్యాగ్ · 3 కథనాలు

క్యూట్ లవ్ స్టోరీ "శ్రీకారం "- శర్వానంద్
"శ్రీకారం "మూవీ షూటింగ్ పునః ప్రారంభం

"శ్రీకారం "మూవీ పై ఉప రాష్ట్రపతి ప్రశంసలు
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “శ్రీకారం “మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది . సందేశాత్మక చిత్రం గా రూపొందిన ఈ మూవీ లో సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. హీరో శర్వానంద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
క్యూట్ లవ్ స్టోరీ "శ్రీకారం "- శర్వానంద్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “శ్రీకారం “మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ కానుంది. సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “శ్రీకారం “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.
"శ్రీకారం "మూవీ షూటింగ్ పునః ప్రారంభం
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభం లో పడిన విషయం తెలిసిందే. మూవీ షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు ఇబ్బందికి గురి అయ్యాయి. సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. సుమారు 6 నెలల తరువాత షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యి చిత్ర పరిశ్రమ కళ కళ లాడుతుంది. కరోనా టైమ్ లో షూటింగ్స్ నిలిచిపోయిన సినిమాలు ఒక్కొక్కటిగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. థియేటర్స్ రీ ఓపెనింగ్ తో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు.