
ట్యాగ్ · 5 కథనాలు

అన్ని భాషల నటిని -శృతి హాసన్
క్లాసికల్ డ్యాన్సర్ పాత్ర లో శృతి హాసన్
స్టార్ హీరో శింబు కు జోడీగా శృతి హాసన్ ?
రవితేజ మూవీ #RT66 హీరోయిన్

అక్టోబర్ లో "వకీల్ సాబ్ " షూటింగ్ లో శృతి హాసన్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ "పింక్ " తెలుగు లో రీమేక్ అవుతుంది. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కథానాయిక. అంజలి , నివేద థామస్ , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
అన్ని భాషల నటిని -శృతి హాసన్
తమిళ , తెలుగు , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో హీరో రవితేజ కు జోడీగా నటిస్తున్నారు. "లాభం " తమిళ మూవీ లో హీరో విజయ్ సేతుపతి కి జంటగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ లో శృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
క్లాసికల్ డ్యాన్సర్ పాత్ర లో శృతి హాసన్
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ తనయ, సైకాలజీ స్టూడెంట్ శృతి హాసన్ సినిమా , సంగీతం పై ఫోకస్ పెట్టి మ్యూజిక్ నేర్చుకొనడానికై తరుచూ US వెళ్ళేవారు. "హే రామ్ "(తమిళ , హిందీ ) మూవీ లో గెస్ట్ రోల్ లో నటించి శృతి నటనకు శ్రీకారం చుట్టారు. "లక్ " మూవీ తో బాలీవుడ్ కు హీరోయిన్ గా శృతి పరిచయం అయ్యారు. "అనగనగా ఓ ధీరుడు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శృతి "గబ్బర్ సింగ్ ", "బలుపు ", ఎవడు ", "రేసు గుర్రం ", "శ్రీమంతుడు " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.
స్టార్ హీరో శింబు కు జోడీగా శృతి హాసన్ ?
తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకుంటున్నారు. శృతి ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ ", విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
రవితేజ మూవీ #RT66 హీరోయిన్
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మూవీస్ దర్శకుడు గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ మూవీ కి రంగం సిద్ధమైంది. డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్ మూవీస్ తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఠాగూర్ మధు నిర్మాణ సారథ్యంలో గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ హీరోగా ఎంటర్ టైనర్ మూవీ #RT 66 రూపొందనుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ లో హీరోయిన్ గా శ్రుతి హాసన్ ఎంపికయ్యారు.