
ట్యాగ్ · 103 కథనాలు · పేజీ 6

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' - బోల్డ్ పాత్రలో సామ్..షాకవుతారు
సమంత యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా సరే తను అలా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. అల్లరి పాత్ర అయినా.. ఎమోషనల్ పాత్ర అయినా.. రంగస్థలంలోని డీగ్లామర్ పాత్రలో అయినా.. మరీ ముఖ్యంగా సూపర్ డీలక్స్ లో లాంటి బోల్డ్ పాత్ర అయినా సరే సమంత చాలా ఈజ్ తో నటించగలిగే సత్తా ఉన్న నటి. అందుకే అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగి ఇప్పటికే అదే ఫామ్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉంది.

సమంత ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం " మూవీ లో శకుంతల గా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తున్నందుకు సమంత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మరోసారి భయపెట్టనున్న సమంత..!
పెళ్ళైన తర్వాత సమంత తన రూట్ మార్చేసింది. కేవలం పాత్ర ప్రధానమైన... లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తుంది. అంతేకాదు పెళ్ళైన తర్వాత వరుసగా హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో ఇప్పటికే విజయ్ సేతుపతితో కలిసి సమంత సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనితోపాటు తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి కూడా తెలిసిందే.