ట్యాగ్ · 4 కథనాలు
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా..!
సెన్సార్ పూర్తి చేసుకున్న 'సోలో బ్రతుకే సో బెటర్'
సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే ముందు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ముందు కానిచ్చేస్తున్నారు 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్ర యూనిట్. సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ తన ట్విట్టర్ లో తెలిపింది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసిందని.. ‘‘అతి త్వరలో మీ ముందుకు..’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. మరి సినిమా థియేటర్ లో రిలీజ్…
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
మెగా హీరో సాయితేజ్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖుల నుండి పుట్టిన రోజులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా సాయి తేజ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే బాయ్ కు విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే బాబాయ్.. యాదృచ్చికంగా బ్లాక్ బస్టర్ 'బిల్లా రంగా' సినిమా కూడా నేటితో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది.. . ఇది మనకు ఏదో చెబుతోంది అనుకుంటున్నా బాబాయ్. నేను రెడీ.. నువ్వు రెడీయా` అని సాయితేజ్ ఫొటో, `బిల్లా రంగా` సినిమా పోస్టర్ను మనోజ్ ట్వీట్ చేశాడు. మరి దీనిపై సాయి తేజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా మంచు మనోజ్, సాయితేజ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.
వియ్యంకుడు తేజ్ కు థ్యాంక్స్.. త్వరలోనే ముహుర్తాలు..!
వియ్యంకుడు.. త్వరలోనే ముహుర్తాలు అంటేసాయి తేజ్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడేమో అని అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటటే.. మంచు మనోజ్ హ్యూమర్ గురించి మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక్కోసారి తను పెట్టె పోస్ట్ లు చాలా కామెడీ గా ఉంటాయి. తాజాగా అలాంటి ట్వీటే చేసాడు. మనోజ్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమ పెంపుడు కుక్కులకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సోషల్ డిస్టెన్స్ తో.. టాంగో మరియు జోయాడేట్ డే... నాకు మంచి అల్లుడు ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు. త్వరలోనే ముహూర్తలు పెట్టించి శుభలేఖలు వెయిస్తాం” అని సరదాగా పోస్ట్…
గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా..!
వరుస ప్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు సాయి తేజ్. కథలు ఎంచుకునే విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ గా మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తెరకెక్కుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా.. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.