
ట్యాగ్ · 3 కథనాలు

మరో సినిమా మొదలుపెట్టిన 'నిఖిల్'
యంగ్ హీరో నిఖిల్ మాత్రం తన జోరును అస్సలు తగ్గించట్లేదు. హ్యాపీడేస్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నిఖిల్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా కథల విషయంలో కాస్త తడబడ్డాడు.. ఆ తర్వాత మంచి కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసందే. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక…

గూఢచారిగా నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ “, చందు మొండేటి దర్శకత్వంలో “కార్తికేయ 2 ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. కరోనా బాధితులకు హీరో నిఖిల్ తన వంతు సాయం అందించారు. రీసెంట్ గా "18 "పేజెస్ "మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసిన హీరో నిఖిల్ స్పై- యాక్షన్ కథాంశంతో ఉన్న ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిఖిల్ హీరో గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

'సుమంత్' కొత్త సినిమా ప్రారంభం
హీరో సుమంత్ కూడా జయాపయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎక్కువ కమర్షియల్ హంగులకు పోకుండా.. తనకు సూటయ్యే పాత్రలు చేసే నటుల్లో సుమంత్ కూడా ఒకడు. సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్, కపటధారి సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. ప్రస్తుతం మను యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గార్లపాటి రమేష్, డాక్టర్ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్…