
ట్యాగ్ · 3 కథనాలు

సోషల్ మీడియా లో రికార్డ్
సోషల్ మీడియాలో ప్రభాస్ మరో రికార్డ్

ప్రభాస్ ఫేస్ బుక్ రికార్డ్
బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ "సాహో "మూవీ తో బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 4 మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. "రాధేశ్యామ్ "మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్ "సలార్ ", "ఆదిపురుష్ ", "ప్రాజెక్ట్ K "మూవీస్ లో నటిస్తున్నారు.
సోషల్ మీడియా లో రికార్డ్
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ,తెలుగు , హిందీ భాషలలో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ " భారీ అంచనాలతో జులై 30వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న "సలార్ ", "ఆదిపురుష్ "మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ప్రభాస్ మరో రికార్డ్
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల ప్రభాస్ ట్విట్టర్ లో మిలియన్స్ లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో రికార్డు ను సొంతం చేసుకున్నాడు.