
ట్యాగ్ · 3 కథనాలు

రాపో22 నుండి రామ్ పోతినేని ఫస్ట్ లుక్ రివీల్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాపో22' (RAPO22 - వర్కింగ్ టైటిల్). ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ మూవీ ఇటీవలే పూజాకార్యక్రమాలతో గ్రాండ్గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే.

జిమ్ లో హీరో రామ్
హీరో రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటున్న హీరో రామ్ తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రామ్ పోతినేని న్యూ లుక్
సూపర్ హిట్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ పోతినేని, ఆ మూవీ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్ష కులను ఆకట్టుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన చాక్లెట్ బాయ్ లా ఉండే హీరో రామ్ , బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో ఒక మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా జీ సినీ అవార్డ్ అందుకున్నారు. "ఇస్మార్ట్ శంకర్ " మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో రామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.