
ట్యాగ్ · 3 కథనాలు

రామ్ చరణ్ ‘రంగస్థలం’కు రెండేళ్ళు
అన్నదమ్ముల సెంటిమెంట్‌తో తెలుగునాట పలు చిత్రాలు సందడి చేశాయి. వాటిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ ఒకటి. ఇందులోని “చిట్టిబాబు” పాత్రలో చరణ్ అభినయించిన తీరు విమర్శకులను సైతం కట్టిపడేసింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ 80లనాటి పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో సమంత కథానాయికగా నటించింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేష్, అనసూయ భరద్వాజ్, రోహిణి, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించగా... స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నర్తించింది.
అభిమానులకు రామ్ చరణ్ మనవి
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తం గా జన జీవనం అస్తవ్యస్తమయింది. కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంది. ఇప్పటికే నిర్మాతలు మూవీ రిలీజ్ లు, షూటింగ్స్ రద్దుచేశారు. టాలీవుడ్ ప్రముఖులు ఎటువంటి వేడుకలు నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నారు.

మరోసారి జెంటిల్ మ్యాన్ అయిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి జెంటిల్ మ్యాన్ అనిపించుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మెగా అభిమానులను నిరాశపరిచింది. దీంతో సినిమా ఫెయిల్యూర్ పై చరణ్ స్పందిస్తూ అభిమానులకు సారీ చెబుతూ ఓ లేఖ కూడా రాశారు. ఎంతో కష్టపడి సినిమా తీశామని.. కానీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ ఈ సినిమా కాలేకపోయింది. మాకు సపోర్ట్ గా నిలిచినందుకు థ్యాంక్స్... ముందు ముందు మంచి సినిమాలతో వస్తామని తెలిపారు. దీంతో చరణ్ పై ప్రశంసలు కురిపించారు అందరూ.