
ట్యాగ్ · 4 కథనాలు


మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రకుల్

శాకాహారి గా మారిన రకుల్ ప్రీత్
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ లో బిజీగా ఉన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు జీవితాంతం కట్టుబడి ఉండాలనే విషయాన్ని రకుల్ ప్రీత్ అంగీకరించారు. ప్లానింగ్ ఏమీ లేకుండా మాంసాహారి గా ఉన్న రకుల్ సడెన్ గా శాకాహారి గా మారాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తాను తీసుకున్న సరైన నిర్ణయాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని రకుల్ అన్నారు.
డిజిటల్ వరల్డ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ
వెబ్ సిరీస్ కు ప్రేక్షకాదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా వెబ్ సిరీస్ ల ను ఓకే చేశారు. లెజెండరీ పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ "క్వీన్ " లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అమెజాన్ ప్రైమ్ నిర్మించే వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రకుల్
మొత్తానికి ఇటు తెలుగు, అటు తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీ అయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ మధ్య కాస్త వెనుక పడినా ఇప్పుడు మాత్రం తన కెరీర్ పై దృష్టి పెట్టి పలు కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టింది. ప్రస్తుతం హిందీలో ఆమె చేసిన ‘మర్జవాన్’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాపైనే ఇప్పుడు రకుల్ హోప్స్ అన్నీ.

అర్జున్ రెడ్డి పై క్రష్ లిస్ట్ లో మరో స్టార్ హీరోయిన్
ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు అర్జున్ రెడ్డి అదే విజయ్ దేవరకొండ. ఆ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు సౌత్ మొత్తం ఇంకా నార్త్ లో కూడా ఒక్కసారిగా టాక్ అఫ్ ద టౌన్ అయి మంచి క్రేజ్ ను సైతం దక్కించుకున్నాడు. అంతే కాదు పలువురు హీరోయిన్లకు కూడా హాట్ ఫెవరెట్ అయ్యాడు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు అర్జునరెడ్డి పై ఉన్న క్రష్ ను ఓపెన్ గానే చెప్పేసారు.