ట్యాగ్ · 3 కథనాలు

రకుల్ ప్రీత్ సింగ్‌కి రేర్ ఛాన్స్?
శివ కార్తికేయన్‌తో తో నా డీల్ అదే
రకుల్ ప్రస్తుతం వరుస సినిమాతో షూటింగ్ లతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఇక తమిళ్ లో శివ కార్తికేయన్ హీరోగా 'అయలాన్' సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివకార్తికేయన్ పై రకుల్ ప్రశంసలు కురిపించింది. అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ కూడా కుదుర్చుకున్నట్టు తెలిపింది.
స్టోరీ సూపర్ గా ఉంటే మూవీ ఓకే చేస్తా - రకుల్ ప్రీత్ సింగ్
"కెరటం " మూవీతో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ , కోలీవుడ్ లకు ఎంటర్ అయ్యారు. కొన్ని తమిళ మూవీస్ లో నటించిన తరువాత రకుల్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ " మూవీ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. రకుల్ హీరోయిన్ గా నటించిన లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం మూవీస్ ఘనవిజయం సాధించాయి. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన "స్పైడర్ " మూవీ తరువాత రకుల్ కోలీవుడ్ లో బిజీగా మారారు. రకుల్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ మూవీ "దే దే ప్యార్ దే " ఘనవిజయం సాధించడం తో పలు బాలీవుడ్ మూవీస్ లో అవకాశాలు అందుకొంటున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్‌కి రేర్ ఛాన్స్?
రకుల్ ప్రీత్ సింగ్... తెలుగు సినీ వినీలాకాశంలో తిరుగులేని తారలా దూసుకుపోతున్న ఈ తరం కథానాయిక. దాదాపు ఈ జనరేషన్ టాప్ హీరోలందరితోనూ కలసి నటించిన ఈ ఉత్తరాది భామ... ఇప్పుడు ఓ సీనియర్ హీరోతోనూ కలసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు... టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున. `మన్మథుడు` సీక్వెల్‌గా రూపొందుతున్న `మన్మథుడు 2`లో నాగ్‌కి జోడీగా నటించే అవకాశం రకుల్‌కి దక్కిందని టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు స్థానముండగా... వారిలో ఒకరిగా రకుల్ నటిస్తోంది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా... పెర్‌ఫార్మెన్స్‌కు కూడా స్కోప్…