
ట్యాగ్ · 4 కథనాలు


'రాధేశ్యామ్'.. ట్రైలర్ రిలీజ్ కు స్టేజ్ సెట్
'రాధే శ్యామ్' ఫస్ట్ గ్లింప్స్ కు టైం ఫిక్స్

'రాధేశ్యామ్' ట్రైలర్ కు నేను వర్క్ చేయలేదు..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా వస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించనుండగా.. పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇక ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా.. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి ప్రమోషన్ వీడియోస్, సాంగ్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీగా నిర్వహిస్తున్నారు.

'రాధేశ్యామ్'.. ట్రైలర్ రిలీజ్ కు స్టేజ్ సెట్
ఈసంక్రాంతికి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ కూడా ఒకటి. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాధేశ్యామ్'. ఈసినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ వరుస అప్ డేట్స్ ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి పలు పోస్టర్లతో పాటు వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. పాటలు కూడా అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి.
'రాధే శ్యామ్' ఫస్ట్ గ్లింప్స్ కు టైం ఫిక్స్
ప్రభాస్, పూజా హెగ్డేల ప్రేమ కావ్యానికి ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. వీరిద్దరి కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా వస్తున్నసంగతి తెలిసిందే. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. పూజా హెగ్డే .. ప్రేరణ అనే పాత్రలో కనిపించనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు తాజాగా టైం కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 14 ఉదయం 9.18 ని.లకు సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్టు తెలియచేస్తూ ప్రభాస్ పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రీ టీజర్ లో తన లుక్ తో అదరగొట్టిన ఈ పోస్టర్ లో తన క్లాస్ లుక్ తో మరోసారి…

'రాధే శ్యామ్' - 'విక్రమాధిత్యగా' గా ప్రభాస్
సోషల్ మీడియా లో ప్రభాస్ సందడి మొదలైపోయింది. పుట్టిన రోజుకు మరో రెండు రోజులు ఉండగానే అప్పుడే ప్రభాస్ కు సంబంధించిన సర్ ప్రయిజ్ లు ఇస్తూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఇక ఈ రోజు రాధే శ్యామ్ నుండి సర్ ప్రయిజ్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడని తెలుపుతూ ఆ సినిమా యూనిట్ ఆయనకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది. కారు ముందు భాగంపై కూర్చొని కిందికి చూస్తూ ప్రభాస్ నవ్వుతూ కనపడుతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు.