కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas Latest News 2020

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

`ప్ర‌భాస్ 21`... ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. పాన్ - వ‌రల్డ్ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ ఓ సూప‌ర్ హీరోలా క‌నిపిస్తాడ‌ని చెప్పుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
Prabhas New Movie With Director Nag Ashwin,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Prabhas New Movie,Director Nag Ashwin Upcoming projects,Prabhas Nag Ashwin Movie,Darling Prabhas,Prabhas,Prabhas New
సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ కన్ఫామ్

గతకొద్ది రోజులుగా నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. వైజయంతి మూవీస్ చెప్పినట్లే భారీ అనౌన్స్మెంట్ తో ముందుకు వచ్చేసింది. మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటున్నట్టు వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ 'మిర్చి'కి ఏడేళ్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు విజయవంతమైన యాక్షన్ ఎంటర్టైనర్స్ లో సందడి చేసాడు. వాటిలో 'మిర్చి' ఒకటి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన తొలి చిత్రమిది. రచయిత నుండి దర్శకుడిగా మారిన ఈ సినిమాతో... శివ మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన ఈ సినిమాలో సత్య రాజ్, నదియా, సంపత్ రాజ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి తొలి అడుగు వేయడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డైరెక్టర్, హీరోల ప్రొడక్షన్ హౌస్ ?

దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ హీరోగా రూపొందిన "బాహుబలి", " బాహుబలి 2" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్స్ తో ఈ మూవీస్ ప్రపంచవ్యాప్తం గా తెలుగు సినిమా సత్తా చాటాయి. రాజమౌళి ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీ "RRR"షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ #Prabhas20 షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్

షేర్