
ట్యాగ్ · 3 కథనాలు

బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ప్రభాస్ మూవీ
'ప్రభాస్ 21' కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్..!

"#Prabhas 21"మూవీ కి హాలీవుడ్ టీమ్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్"Prabhas 20" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా జార్జియా దేశంలో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఆ బ్యాలెన్స్ షూటింగ్ ను హైదరాబాద్ లో జార్జియా బ్యాక్ డ్రాప్ లో సెట్ రూపొందించి చిత్రీకరణ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తరువాత మరో మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ప్రభాస్ మూవీ
వైజయంతి మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ హీరోగా రూపొందిన "బాహుబలి" ,"బాహుబలి 2" , "సాహో " మూవీస్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించాయి. ఈ మూవీస్ తో బాలీవుడ్ లో ప్రభాస్ మూవీస్ పై క్రేజ్ పెరిగింది. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
'ప్రభాస్ 21' కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్..!
ప్రభాస్ 20 సినిమానే ఇంకా పూర్తికాలేదు కానీ ప్రభాస్ 21 సినిమాపై మాత్రం రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వస్తూనే ఉంది. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమాలో భారీ కాస్టింగ్ నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామిని తీసుకోవాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. పాన్ వరల్డ్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో.. ఈ సినిమాకు స్టార్ క్యాస్ట్ సైతం భారీగా ఉండనుందట. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులను ఈ…