ట్యాగ్ · 3 కథనాలు
'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో "పెళ్ళి సందడి "
"పెళ్ళిసందD " లో ప్రత్యేక పాత్రలో శ్రీకాంత్ ?
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పెళ్ళిసందడి " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవళి , దీప్తి భట్నాగర్ కథానాయికలు. కీరవాణి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని "పెళ్ళిసందడి " మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తో శ్రీకాంత్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. క్లీన్ ఎంటర్ టైనర్ గా "పెళ్ళిసందడి " మూవీని తెరకెక్కించి దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 25 సంవత్సరాల తరువాత "పెళ్ళిసందడి " మూవీ సీక్వెల్ తెరకెక్కనుంది.
'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది.
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో "పెళ్ళి సందడి "
లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు నిర్మాత , దర్శకుడు , రైటర్ , కొరియోగ్రాఫర్ గా నాలుగున్నర దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. "బాబు "(1975 ) మూవీ తో రాఘవేంద్ర రావు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. స్టార్ హీరోలతో తెలుగు , హిందీ భాషలలో 100 పైగా మూవీస్ దర్శకత్వం వహించి , పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అనేక ఆణిముత్యాలవంటి మూవీస్ కు దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు ఇప్పుడు ఒక మూవీ ని ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు .