ట్యాగ్ · 3 కథనాలు

మరో కోణం లో పాయల్ రాజ్ పుత్
`యన్.బి.కె. 106` కోసం పాయల్ తో సంప్రదింపులు?
"ఇండియన్ 2" మూవీ లో పాయల్ స్పెషల్ సాంగ్ ?
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా "ఇండియన్ 2" తమిళ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "ఇండియన్ "(భారతీయుడు ") మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ కథానాయికలు. సిద్ధార్ధ్ , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మరో కోణం లో పాయల్ రాజ్ పుత్
సూపర్ హిట్ "RX 100" మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం ఫైటర్ పైలెట్ గా "నరేంద్ర "తెలుగు మూవీ లో నటిస్తున్నారు. తమిళమూవీ "ఏంజెల్ "తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. లాక్ డౌన్ సమయంలో పాయల్ ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే.
`యన్.బి.కె. 106` కోసం పాయల్ తో సంప్రదింపులు?
`ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే, ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కాకపోతే, సీనియర్ స్టార్ వెంకటేష్ తో కలసి నటించిన `వెంకిమామ` కాస్త ఊరటనిచ్చింది. కాగా, మరో సీనియర్ హీరోతో పాయల్ నటించే అవకాశముందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ తో కథనాలు వినిపిస్తున్నాయి.