
ట్యాగ్ · 4 కథనాలు


తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న అకీరా

ఖిలాడి డైరెక్టర్ తో పవన్.. క్లారిటీ ఇచ్చిన బండ్ల

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న 'వకీల్ సాబ్' టీజర్

"హరిహర వీరమల్లు" కెరీర్ కు పెద్ద బూస్ట్ - నిధి అగర్వాల్
“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపొందుతున్న "హరిహర వీరమల్లు" మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న అకీరా
పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఈనేపథ్యంలో ఇప్పుడు మరోసారి అకీరా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. దీనికి కారణం రేణు దేశాయ్ అకీరాకు సంబంధించిన ఒక వీడియోను ఇన్ట్సాలో పోస్టే చేయడమే. తాజాగా అకీరానందన్ కర్ర సాము చేస్తున్న ఒక వీడియోని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అకీరా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ అకీరాని కొనియాడుతున్నారు.

ఖిలాడి డైరెక్టర్ తో పవన్.. క్లారిటీ ఇచ్చిన బండ్ల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత చాలా స్పీడు మీదున్నాడు. యంగ్ డైరెక్టర్స్ కు వరుస ఛాన్స్ లు ఇస్తున్నాడు ఇప్పటికే తను నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవ్వగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. ఇక వీటితో పాటు మరో రెండు సినిమాలు కూడా పవన్ పాకెట్ లో ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరోసినిమా లైన్ లో ఉన్నాయి.

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న 'వకీల్ సాబ్' టీజర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సత్తా ఏంటో మరో సారి నిరూపించాడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ టీజర్ ను పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ టీజర్ కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా కోర్టులో వాదించడం తెలుసు కోటు తీసి కొట్టడం తెలుసు అని చెప్పే డైలాగ్ వైరల్ గా మారింది. పవర్ స్టార్ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. దీనితో టీజర్ ఇప్పుడు ట్రెండింగ్ లో మొదటి స్థానంలో 10 మిలియన్స్ పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది.