
ట్యాగ్ · 3 కథనాలు


"భీమ్లా నాయక్ "ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
'లాయర్ సాబ్' గా పవన్ కళ్యాణ్?

"భీమ్లా నాయక్"షూటింగ్ ను కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం " "భీమ్లా నాయక్", "హరి హర వీరమల్లు " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "భవదీయుడు భగత్ సింగ్ "మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు హరీష్ , పవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన "గబ్బర్ సింగ్" మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

"భీమ్లా నాయక్ "ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
'లాయర్ సాబ్' గా పవన్ కళ్యాణ్?
తన సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ `అజ్ఞాతవాసి` తరువాత క్రియాశీలక రాజకీయాలతో బిజీ అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కాగా, రెండేళ్ళ విరామం అనంతరం.. వెండితెరపై మరోసారి వెలుగులు పంచేందుకు ఈ టాలెంటెడ్ స్టార్ సన్నద్ధమవుతున్నారని టాక్. అంతేకాదు... హిందీనాట సంచలన విజయం సాధించిన కోర్టు డ్రామా `పింక్`ని రీమేక్ చేస్తూ... తన రీ-ఎంట్రీకి రెడీ అవుతున్నారట. `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారని వినికిడి. అలాగే పవన్ సన్నిహితుడు, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ రీమేక్‌కి సంభాషణలు అందించనున్నారట…