
ట్యాగ్ · 3 కథనాలు

"రంగ్ దే !" మూవీ అప్ డేట్
షూటింగ్ షెడ్యూల్ సేఫ్ గా పూర్తి

బిజీ యంగ్ హీరో నితిన్
సూపర్ హిట్ "జయం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ బ్లాక్ బస్టర్ "దిల్ "మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. "ఇష్క్ ", "గుండె జారి గల్లంతయ్యిందే ", చిన్నదాన నీకోసం ", "అ ఆ ", "భీష్మ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ కథానాయకుడిగా రూపొందిన "రంగ్ దే !" మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో నితిన్ బిజీగా ఉన్నారు.
"రంగ్ దే !" మూవీ అప్ డేట్
పలు బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్న ఇటలీ దేశంలో షూటింగ్స్ జరపడానికై పలు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ ఇటలీ లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సేఫ్టీ ప్రికాషన్స్ తో "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ సక్సెస్ ఫుల్ గా జరుగుతుంది. ఇప్పుడు మరో చిత్ర యూనిట్ ఇటలీ లో షూటింగ్ కై ప్లాన్ చేసింది.
షూటింగ్ షెడ్యూల్ సేఫ్ గా పూర్తి
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "రంగ్ దే !"మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. నరేష్ , బ్రహ్మాజీ , వినీత్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.