ట్యాగ్ · 3 కథనాలు
హీరో నిఖిల్ భావోద్వేగం
దర్శకుడు ఆర్ జి వి కి నిఖిల్ కౌంటర్
ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల విమర్శలు అందుకుంటున్నారు. వర్మ ప్రస్తుతం "పవర్ స్టార్ " మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇది పవర్ స్టార్ బయోపిక్ కాదు అని అనౌన్స్ చేసిన వర్మ పవన్ కళ్యాణ్ , చిరంజీవి పోలిన మనుషులతో "పవర్ స్టార్ " మూవీ ని రూపొందిస్తున్నారు. ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ పరిస్థితి గురించి ఈ మూవీ రూపొందించినట్టుగా ఉంది.
హీరో నిఖిల్ భావోద్వేగం
భారత్ , చైనా బోర్డర్ లద్ధాఖ్ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసారు. వారిలో సూర్యాపేట కు చెందిన కర్నల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ , వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియా , చైనా బోర్డర్ లో జరిగిన సంఘటనకు రక్తం మరిగిపోతుందని, చైనా వస్తువులు బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సుకుమార్-నిఖిల్ మూవీ టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
అర్జున్ సురవరం తర్వాత వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు నిఖిల్. ఇప్పటికే నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్ కార్తికేయ2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా తిరుమల తిరుపతి లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇక షూటింగ్ ఉగాది నుంచి మొదలవతుంది. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభిస్తున్నారు.