
ట్యాగ్ · 44 కథనాలు · పేజీ 3

'కార్తికేయ 2' - చైత్రంలో చిత్రీకరణ

'కార్తికేయ2' ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

'లాక్ డౌన్' అయినా ఆగని నిఖిల్ '18 పేజీస్'
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన కృతి శెట్టి ని సెలెక్ట్ చేశాడు సుకుమార్. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆపే ప్రసక్తే లేదు - అవసరమైతే గుడిలో పెళ్ళిచేసుకుంటాం..!
ఏది ఏమైనా పెళ్లి ఆపే ప్రసక్తే లేదు.. అవసరమైతే గుడిలో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఓ యంగ్ హీరో. ఆ హీరో ఎవరో కాదు... నిఖిల్. భీమవరం కు చెందిన డాక్టర్ పల్లవి వర్మ తో గత నెల ఫిబ్రవరి 1వ తేదీన నిఖిల్ నిశ్చితార్ధం పెద్దల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా పెళ్లి ముహుర్తాన్ని ఏప్రిల్ 16 వ తేదీకి ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ పెళ్లి జరుగుతుందా?లేదా?అన్న డౌట్ లు మొదలయ్యాయి. ఇప్పటికే ఇదే డేట్ లో ఉన్న నితిన్ పెళ్లి డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
'కార్తికేయ 2' - చైత్రంలో చిత్రీకరణ
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు కేవలం వార్తల్లోనే నిలిచిన ఈ సినిమా ఫైనల్ గా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ సినిమాను తిరుమల తిరుపతి లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఈ చిత్రం చిత్రకరణ ఉగాది నుంచి మొదలవతుంది. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభిస్తున్నారు.

'కార్తికేయ2' ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. పీపుల్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను "కార్తికేయ2" మార్చి 2 న తిరుమల తిరుపతి లో పూజాకార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.