
ట్యాగ్ · 4 కథనాలు


మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ
నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో `యన్.బి.కె. 106`

"NBK107" ఫస్ట్ హంట్ లోడింగ్
బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ
హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "అఖండ" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ , టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. "అఖండ "మూవీ తరువాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందే ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బాలకృష్ణ - బోయపాటి సినిమా షూటింగ్ ప్రారంభం
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ తో షూటింగును మొదలెట్టారు. తొలి షెడ్యూల్లోనే యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. గ్రహాలు .. ప్రభావం ఒక కోణంగా, అఘోర పాత్ర మరో కోణంగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు.
నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో `యన్.బి.కె. 106`
నటసింహ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `సింహా`, `లెజెండ్` సంచలన విజయం సాధించాయి. సుదీర్ఘ విరామం అనంతరం... ఈ ఇరువురు ఓ డివోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం జట్టుకట్టారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.