
ట్యాగ్ · 6 కథనాలు


“కృష్ణ వ్రింద విహారి" మూవీ రిలీజ్ డేట్

వరుడు కావలెను షూటింగ్ కంప్లీట్

'#NS22' షూటింగ్ స్టార్ట్

'వరుడు కావలెను' షూటింగ్ రీస్టార్ట్

బిజీ యంగ్ హీరో నాగశౌర్య

నాగశౌర్య రంగబలి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ కు మంచి సినిమా అందించేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉంటాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

“కృష్ణ వ్రింద విహారి" మూవీ రిలీజ్ డేట్
శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణ లో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య , సింగర్ , యూట్యూబర్ , యాక్ట్రెస్ షిర్లీ సేఠియా జంటగా తెరకెక్కిన “కృష్ణ వ్రింద విహారి" మూవీ మే 20 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. వెన్నెల కిషోర్ , సత్య , బ్రహ్మాజీ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. సాగర్ మహతి సంగీతం అందించారు.

వరుడు కావలెను షూటింగ్ కంప్లీట్
యంగ్ హీరో నాగ శౌర్య కూడా ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఒకటి కాదు రెండు ఇప్పుడు నాగశౌర్య చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా.. కొన్ని సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ఇందులో లక్ష్య సినిమా ఇప్పటికే రిలీజ్ అవుతుండగా తాజాగా వరుడు కావలెన్ సినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

'#NS22' షూటింగ్ స్టార్ట్
నాగశౌర్య ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి లక్ష్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా లాస్ట్ షైడ్యూల్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది. క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనితో పాటుసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు.

'వరుడు కావలెను' షూటింగ్ రీస్టార్ట్
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోలలో నాగశౌర్య కూడా ఒకడు. ఊహలు గుస గుస లాడే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగశౌర్య విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లో ఈహీరో 5 వ స్థానాన్ని దక్కించుకోవడంవిశేషం. మరోవైపు లాక్ డౌన్ ను కూడా తన ఫిట్ నెస్ కోసం బాగానే వాడుకుంటున్నాడు. సిక్స్ ప్యాక్ లుక్ తో తన మేకోవర్ ను మొత్తం మార్చేశాడు.

బిజీ యంగ్ హీరో నాగశౌర్య
హీరో నాగశౌర్య వరస మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్వంత బ్యానర్ తో పాటు ఇతర బ్యానర్స్ లోనూ నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లోని క్యారెక్టర్ కై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ సాధించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా "వరుడు కావలెను "మూవీ తెరకెక్కుతుంది.