ట్యాగ్ · 5 కథనాలు
బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నాగ చైతన్య?
నాగచైతన్యతో `ఆర్ ఎక్స్ 100` డైరెక్టర్?

స్పెషల్ డేన రానున్న చైతు ప్రేమకథ?

మల్టీ స్టారర్ మూవీస్ లో నాగ చైతన్య
ఐదోసారి జట్టుకట్టనున్న చైతూ-సామ్?
`ఏమాయ చేసావె`, `మనం`, `ఆటోనగర్ సూర్య`, `మజిలీ` చిత్రాల్లో జంటగా నటించి అలరించారు నాగచైతన్య, సమంత. అలాగే పెళ్ళికి ముందు `మనం`లోనూ, పెళ్ళి తరువాత `మజిలీ`లోనూ భార్యాభర్తల పాత్రల్లో దర్శనమిచ్చారు. కట్ చేస్తే... ఈ ఇద్దరూ మరోసారి జంటగా నటించేందుకు సిద్ధమవుతున్నారని టాక్.
బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నాగ చైతన్య?
ప్రస్తుతం తెలుగునాట అగ్ర కథానాయకుల నుంచి యువ కథానాయకుల వరకు అందరూ పరభాషా చిత్రాల రీమేక్‌ల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వరుసలోనే యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా తాజాగా ఓ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
నాగచైతన్యతో `ఆర్ ఎక్స్ 100` డైరెక్టర్?
`ఆర్ ఎక్స్ 100`(2018)తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు అజయ్ భూపతి. పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్... బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో... అజయ్ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ మధ్య పలువురు యువ కథానాయకుల కాంబినేషన్స్‌లో అజయ్ పేరు వినిపించినా... ఇప్పటివరకు తన రెండో చిత్రం పట్టాలెక్కలేదు.

స్పెషల్ డేన రానున్న చైతు ప్రేమకథ?
యువ సామ్రాట్ నాగ చైతన్య , సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ డ్యాన్స్ బేస్డ్ మ్యూజికల్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం... ప్రస్తుతం హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

మల్టీ స్టారర్ మూవీస్ లో నాగ చైతన్య
సూపర్ హిట్ మజిలీ మూవీ తరువాత నాగచైతన్య, KS రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ లో విక్టరీ వెంకటేష్ తో కలసి నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ మామ మూవీ లో నాగ చైతన్య తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని, దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక ప్రేమ కథ రూపొందుతుంది.