
ట్యాగ్ · 3 కథనాలు


జూలైలో రీ-రిలీజ్‌ల హంగామా
టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీ-రిలీజ్ ట్రెండ్ దిగ్విజయంగా నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్ డేలు, లేదా ఆయా సినిమాల యానివర్సరీస్ సందర్భంగా ఒకప్పుడు సూపర్ హిట్ అయిన చిత్రాలను మేకర్స్ మళ్ళీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. వీటికి అభిమానులనుంచి సాలిడ్ సపోర్ట్ అందుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జూలై నెలలో ఏకంగా అరడజను సినిమాలు రీ-రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి.

ఓటీటీలోకి వచ్చేసిన ఎంఎస్ ధోని ‘ఎల్‌జీఎం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి 'ధోనీ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యానర్ నుంచి నిర్మించిన తొలి సినిమా ‘ఎల్‌జీఎం’. 'లెట్స్ గెట్ మ్యారీడ్' అనేది ఉప శీర్షిక. తమిళంలో రూపొందిన ఈ సినిమా డబ్బింగ్ చేసుకుని పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయింది. కాగా ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనంతరం సినిమా రంగంలోకి ఎంటర్ అవుతూ ఫస్ట్ టైమ్ ప్రొడ్యూస్ చేసిన మూవీ కావడంతో.. మొదటినుంచీ ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్ హీరోగా, 'లవ్‌టుడే' ఫేమ్…

ధోని గ్రాఫిక్ నవల "అధర్వ" ఫస్ట్ లుక్ రిలీజ్
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచం అంతటా చాలా మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇండియన్ క్రికెట్ కి దూరమైనా ఐపీఎల్ ద్వారా అభిమానులని అలరిస్తున్నాడు. క్రికెట్ తో పాటు వేరే గేమ్స్, సాహస కార్యక్రమాలు, బైక్ రైడింగ్స్, యాడ్స్ …వంటి వాటితో అభిమానులను అలరిస్తున్న ధోని ఇప్పుడు మరో కొత్త అవతారంలో పలుకరించనున్నారు.