
ట్యాగ్ · 3 కథనాలు


తుది దశలో రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ మూవీ..!

మేఘ ఆకాష్ 3 మిలియన్ సెలబ్రేషన్స్

మాస్ లుక్ లో మేఘా ఆకాష్
లై మూవీ తో టాలీవూడ్ కు పరిచయం అయిన మేఘా ఆకాష్ తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తలైవా రజనీకాంత్ సూపర్ హిట్ పెట్ట మూవీ తో మేఘ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. 3 తమిళ , రెండు హిందీ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మేఘ సూపర్ హిట్ రాజ రాజా చోర మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. మేఘ ప్రస్తుతం 5 తెలుగు , 3 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

తుది దశలో రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ మూవీ..!
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా...అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టి షూటింగ్ ను కూడా శరవేగంగా జరుపుకుంటుంది. క్కా ప్లానింగ్ తో అనుకున్నది అనుకున్నట్లు షూటింగ్ చేసుకుంటోంది. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని ఈమధ్యనే రెండో షెడ్యూల్ ను కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్టు చిత్రబృందం తెలుపుతుంది. ఈ షెడ్యూల్ తో దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసినట్టు తెలుస్తుంది.

మేఘ ఆకాష్ 3 మిలియన్ సెలబ్రేషన్స్
“లై “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”ఛల్ మోహన్ రంగ “మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ “పేట ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “శాటిలైట్ శంకర్ ” మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. రీసెంట్ గా "రాజ రాజ చోర ", "డియర్ మేఘ" మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మేఘ ప్రస్తుతం తెలుగులో“గుర్తుందా శీతాకాలం”, “మనుచరిత్ర” తెలుగు మూవీస్, తమిళ భాషలో రెండు మూవీస్ లో నటిస్తున్నారు.