
ట్యాగ్ · 5 కథనాలు


అయ్యప్ప సన్నిధి లో చిరంజీవి

అమ్మకు ప్రేమతో 'చిరు' బర్త్ డే విషెస్..!
సంజయ్ భాయ్ మీరొక ఫైటర్

'పక్కా కమర్షియల్' ముఖ్య అతిథిగా చిరు..!
వరస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ మారుతి. ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా చేస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 26వ తేదీన ఈ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్టు మేకర్స్ తెలియచేశారు. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు…

అయ్యప్ప సన్నిధి లో చిరంజీవి
మెగా స్టార్ చిరంజీవి గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షను తీసుకుంటున్న విషయం తెలిసిందే. శబరిమల లో మండల పూజ, మకరజ్యోతి సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఆ సమయంలో కుదరకపోవడంతోనే ఇప్పుడు చిరంజీవి దంపతులు శబరిమల యాత్రకు వెళ్లారు. మాస పూజ సందర్భంగా ఈ నెల 12 వ తేదీ నుండి 17 తేదీ వరకూ అయ్యప్ప స్వామి దేవాలయం తెరచి ఉంచుతారు. కాగా డోలీలో శబరికొండకు చేర్చిన డోలీ కార్మికులకు మెగాస్టార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారితో కాసేపు ముచ్చటించారు.

అమ్మకు ప్రేమతో 'చిరు' బర్త్ డే విషెస్..!
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సినీ సెలబ్రిటీలు మీద గట్టిగానే పడుతుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఒకరు కోలుకునేలోపే మరొకరు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనాబారిన పడ్డ చిరు ప్రస్తుతం ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో చిరు అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
శివాత్మిక ధైర్యంగా ఉండండి - రాజశేఖర్ త్వరగా కోలుకుంటారు
రాజశేఖర్ దంపతులు ప్రస్తుతం కరోనాకు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ రోజు ఉదయం తన తండ్రి ఆరోగ్యం గురించి శివాత్మిక తన ట్విట్టర్ ద్వారా.. నా తండ్రి కరోనాతో ధైర్యంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది. తప్పుడు వార్తలను ప్రచారం చేయోద్దు. అందరు ధైర్యంగా ఉండండి అని తన ట్వీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
సంజయ్ భాయ్ మీరొక ఫైటర్
సంజయ్ దత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజుల క్రితం ఊపిరి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడటంతో హాస్పిటల్ లో చేరగా అక్కడ సంజయ్ దత్ కు కరోనా పరీక్షలు చేశారు. అయితే కరోనా నెగిటివ్ వచ్చింది కానీ లంగ్ క్యాన్సర్ అని తేలింది. దీనితో త్వరలోనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. అంతేకాదు చికిత్స నిమిత్తం తాను షూటింగ్‌ల నుంచి విరామం తీసుకుంటున్నానని, అయితే తన అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. తన ఆరోగ్యంపై వచ్చే ఎలాంటి రూమర్స్ ను నమ్మవద్దని త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తానని ట్వీట్ కూడా చేశారు.