
ట్యాగ్ · 3 కథనాలు

మహేష్ బాబు కు రామ్ చరణ్ కృతజ్ఞతలు

రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్
సూపర్ హిట్ "చిరుత " మూవీ తో పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య "మూవీ లో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మహేష్ బాబు కు రామ్ చరణ్ కృతజ్ఞతలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రామ్ చరణ్ ఇంటికే పరిమితం అయ్యి ఆ విషయాన్ని సోషల్ మీడియా లో అనౌన్స్ చేశారు. తమ అభిమాన హీరోకు కరోనా అని తెలియగానే లక్షలాది మంది అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. హీరో రామ్ చరణ్ ఆరోగ్యం పై మహేష్ బాబు స్పందించి జాగ్రత్తగా ఉండమనీ, త్వరగా కరోనా నుండి కోలుకోవాలని కోరుకుంటున్నా అనీ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
అప్పుడే 13 ఏళ్లు.. నమ్మలేకపోతున్నా అంటున్న చెర్రీ
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలో అగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎప్పటికప్పుడు తనలోని నటుడిని మెరుగుపరుచుకుంటూ.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ.. జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక చెర్రీ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు అవుతుంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు చరణ్.