ట్యాగ్ · 83 కథనాలు · పేజీ 5
నితిన్ ‘పవర్ పేట్’కు మణిశర్మ స్వరాలు?
`రెడ్`కి మణిశర్మ సెంటిమెంట్
'ఆచార్య' ఆల్బమ్ పై మణిశర్మ క్రేజీ అప్ డేట్..!
టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి టైటిల్ తప్పా ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ వచ్చింది లేదు. అప్ డేట్స్ ఇచ్చే లోపే కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. మొదటి నుండి ఈ సినిమాలు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ నాలుగు నెలలు కనుక ఇలాంటి పరిస్థితులు లేకుండా ఉండి ఉంటేదాదాపు షూటింగ్ ముగిసేదే. ఎలాగూ షూటింగ్ లు కూడా లేవు అప్ డేట్స్ కూడా లేకుండా పోయాయి.
నితిన్ ‘పవర్ పేట్’కు మణిశర్మ స్వరాలు?
యువ కథానాయకుడు నితిన్, దర్శకుడు కృష్ణచైతన్య కాంబినేషన్‌లో ‘పవర్ పేట్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాట ఘనవిజయం సాధించిన ‘వడ చెన్నై’(2018) తరహాలో ఈ చిత్రం రూపొందనుందని టాక్. అంతేకాదు.. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నితిన్‌కు జోడిగా కీర్తి సురేష్ నటించనుండగా విలన్‌గా రావు రమేష్ దర్శనమివ్వనున్నాడని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నట్టు సమాచారం.
`రెడ్`కి మణిశర్మ సెంటిమెంట్
`ఇస్మార్ట్ శంకర్`తో `ఇస్మార్ట్`గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ప్రస్తుతం `మెగాస్టార్ 152`తో పాటు `నారప్ప`, `రెడ్`... ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు బాణీలు అందిస్తున్నాడీ వెటరన్ కంపోజర్. కాగా, వీటిలో `రెడ్` ముందుగా రిలీజ్ కానుంది. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.