ట్యాగ్ · 3 కథనాలు
భారీ పౌరాణిక చిత్రం లో మంచు విష్ణు
చిన్న సినిమాల ప్లానింగ్ లో విష్ణు మంచు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు "విష్ణు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఢీ ", "దేనికైనా రెడీ ", "దూసుకెళ్తా " , "ఈడో రకం ఆడో రకం", "లక్కున్నోడు ", "ఆచారి అమెరికా యాత్ర " వంటి కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి , ఆ బ్యానర్ పై "దేనికైనా రెడీ" , "దూసుకెళ్తా" , "పాండవులు పాండవులు తుమ్మెద" , "కరెంట్ తీగ" , "సింగం 123" వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించారు.
కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నా..వీర జవానుల కథలు నాకు పంపండి..!
సోషల్ మీడియాలో మంచు విష్ణు కాస్త యాక్టీవ్ గానే ఉంటాడు. తన సినిమాలకు సంబందించే కాదు అప్పుడప్పుడు సమాజంలోని విషయాలపై కూడా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియచేస్తుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా జన్మనిచ్చిన తల్లి, వీర జవానులు, రైతుల గొప్పతనం గురించి తెలుపుతూ ఒక వీడియోను పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.
భారీ పౌరాణిక చిత్రం లో మంచు విష్ణు
శివరాత్రి పర్వదిన సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. 60 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు హీరోగా పౌరాణిక చిత్రం "భక్త కన్నప్ప " ను రూపొందించనున్నట్టు మోహన్ బాబు వెల్లడించారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.