
ట్యాగ్ · 3 కథనాలు


డబ్బింగ్ పూర్తి చేసే పనిలో 'మేజర్'

స్కూల్స్ కు "మేజర్"టీమ్ స్పెషల్ ఆఫర్
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'మేజర్' స్మార్ట్ ఆన్సర్.. మా మూవీ గోల్డ్ ఫిష్ లాంటిది..!
డిఫరెంట్ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. పలు జోనర్‌లో స్పెషల్ రోల్స్ పోషిస్తూ యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మేజర్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ కథతో రాబోతున్నాడు. 26/11 ముంబై దాడుల్లో పోరాడి.. తన ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథే 'మేజర్'. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇక కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఈసినిమా ఇప్పుడు వరుస అప్ డేట్స్ తో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. జూన్ 3న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇంకా తక్కువ రోజులే ఉండటంతో వరుస ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. అందులోనూ…

డబ్బింగ్ పూర్తి చేసే పనిలో 'మేజర్'
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అడివి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ చేయగా.. టీజర్ లో…