
ట్యాగ్ · 3 కథనాలు

ట్విట్టర్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ తో సౌత్‌లో నెం.1 హీరోగా మహేష్ బాబు
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సోషల్ మీడియాలో 'సరిలేరు నీకెవ్వరు'
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ సోషల్ మీడియాలో కూడా అదే హవా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం హీరోలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చూస్తూనే ఉన్నాం. తమ సినిమాల గురించి వ్యక్తి గత విషయాలు ఇంకా ఏదైనా అప్ డేట్ ఇవ్వాలన్నా ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాల ద్వారానే తెలియచేస్తున్నారు.
మహేష్ బాబు ట్విట్టర్ రికార్డ్
బాల నటుడిగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు సూపర్ హిట్ "రాజకుమారుడు " మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మహేష్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. వయస్సు పెరుగుతున్నా , మరింత అందంగా మారుతున్న మహేష్ బాబు కు అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ లో మహిళాభిమానులు కూడా అధిక సంఖ్య లో ఉండడం విశేషం.