
ట్యాగ్ · 3 కథనాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్ కు సితార డ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితారకు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. స్టార్ కిడ్ సితార ఇంట్రెస్టింగ్ రీల్స్, పోస్టులతోనూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న సితార చదువు, డాన్స్, ఆటల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేష్ బాబు నటించిన పలు సినిమా పాటలను అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట మూవీలో పెన్నీ సాంగ్ కు అదిరిపోయేలా స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించారు.

సితార కూచిపూడి డ్యాన్స్
చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయ సితార సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన డ్యాన్స్ వీడియోస్ ను షేర్ చేస్తూ సితార అభిమానులను అలరిస్తున్నారు. "సర్కారు వారి పాట " మూవీ పెన్నీ సాంగ్లో తళుక్కున మెరిశారు. ఇప్పటివరకు వెస్ట్రన్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న సితార తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేశారు.

వైరల్ గా 'సితార' డ్యాన్స్.. నెటిజన్స్ ఫిదా ..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్ కాబట్టి ఎలాగూ సితార అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే కేవలం సితార మహేష్ కూతురు గానే కాదు తన టాలెంట్ తో కూడా అందరినీ ఫిదా చేసేస్తుంటుంది. చిన్నప్పటినుండి సితార చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వీడియోలు కానీ ఫొటోలు కానీ ఏవి పోస్ట్ చేసినా అవి వైరల్ గా మారుతుంటాయి. ఇక ఇప్పుడైతే సితారనే సొంతగా యూట్యూబ్ ఛానల్ ను అలానే ఇన్ట్సా అకౌంట్ ను మెయిన్ టైన్ చేస్తుంది.