
ట్యాగ్ · 3 కథనాలు


విక్రమ్ 'మహాన్' టీజర్ రిలీజ్

విక్రమ్ "మహాన్ "పై రజనీకాంత్ ప్రశంసలు
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విక్రమ్ , ధృవ్ విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "మహాన్ "తమిళ మూవీ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ వెర్షన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ అయ్యాయి. మద్యం సిండికేట్ లీడర్ గా విక్రమ్, పోలీస్ అధికారిగా ధృవ్ విక్రమ్ నటించారు. "మహాన్" సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. విక్రమ్ , ధృవ్ ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

విక్రమ్ 'మహాన్' టీజర్ రిలీజ్
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా మహాన్. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నాడు. ఇక తండ్రీకొడుకులిద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితులు బాలేకపోవడంతో ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇక ఈసందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నేడు టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

విక్రమ్ 60 వ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ ,ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా మల్టి స్టారర్ గా" #VIKRAM60 " తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో, ధృవ్ క్యారక్టర్ పాజిటివ్ గా ఉంటుందనీ , ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయనీ సమాచారం. ఈ మూవీ లో వాణి భోజన్ , సిమ్రాన్ , బాబీ సింహా , సనంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.