
ట్యాగ్ · 3 కథనాలు


మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టిన 'లక్ష్'

లక్ష్ 'ధీర' సినిమా షూటింగ్ ప్రారంభం..!
కొంత మంది హీరోలు వరుసగా సినిమాలు చేయకపోయినా తాము చేసే తక్కువ సినిమాల్లోనే విభిన్నత ఉండేలా చూసుకుంటారు. అలాంటి హీరోల్లో లక్ష్ కూడా ఒకడు. విలక్షణ కథలను ఎంచుకుంటూ కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు లక్ష్. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను అలరించినా మంచి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. కానీ ఆ మధ్య వచ్చిన 'వలయం' సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కాస్త విలక్షణమైన కథలను మత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు లక్ష్. ప్రస్తుతం తను చేసిన గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా…

మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టిన 'లక్ష్'
యంగ్ హీరో 'లక్ష్' మాత్రం ఇప్పుడు వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ లోఅంతకు ముందు కొన్ని సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను అలరించినా నిరాశే ఎదురైంది. కానీ ఆ మధ్య వచ్చిన 'వలయం' సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'చదలవాడ బ్రదర్స్' సమర్పణలో రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ ను సొంతం…

'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' విలన్‌గా జయసుధ తనయుడు
ఇండస్ట్రీకి ఎంతో మంది వారసులు వస్తుంటారు. ఎవరి టాలెంట్ కు తగ్గట్టు వాళ్లు సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో ఎదుగుతుంటారు. నటించే సత్తా.. దానికి తోడు కాస్త అదృష్టం ఉంటే స్టార్ రేంజ్ కు వెళతారు.. లేకపోతే మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. అలా ఎంతో మంది వారసులు కొంత మంది స్టార్ హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తుంటే.. కొంతమంది మాత్రం ఇంకా సక్సెస్ ల కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ నటి కొడుకు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అది ఎవరో కాదు తన సహజమైన నటనతో సహజనటిగా పేరు పొందిన జయసుధ తనయుడు నిహార్. నిహార్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేస్తున్నాడు.