కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Kushi Movie

ట్యాగ్ · 63 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

'ఖుషి' - పవన్, భూమిక కామెడీ సీన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌గా నిలిచిన చిత్రం ‘ఖుషి’. 2001 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటికే వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని ఆకాశానికి ఎత్తేసింది. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడిగా భూమికా చావ్లా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ సూపర్. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా .. ఎప్పుడూ గొడవ పడే పాత్రల్లో ఇద్దరూ చేసిన నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి పవన్-భూమిక కామెడీ సీన్స్ మీకోసం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : పవన్ కళ్యాణ్ బెస్ట్ మూవీ ?

శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్ పై ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "ఖుషి " మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఖుషి "మూవీ లో ఉన్న 4 ఫైట్స్ ను పవన్ కళ్యాణ్ కంపోజ్ చేయడం విశేషం. "ఖుషి "మూవీ 8 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Sensational Hit Movie Kushi Turns 19
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ‘ఖుషి’కి 19 ఏళ్ళు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌గా నిలిచిన చిత్రం ‘ఖుషి’. కథానాయకుడిగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని అమాంతం పెంచిన సినిమా ఇది. ఆబాల‌గోపాలాన్ని అలరించిన ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా భూమికా చావ్లా నటించింది. శివాజీ, నాజర్, విజయ్ కుమార్, సుధ, అలీ, రాజన్ పి.దేవ్, ముంతాజ్, జానకి సబేష్, అజయ్ ముఖ్య భూమికలు పోషించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య ఈ మూవీని తెరకెక్కించ‌డ‌మే కాకుండా.. క‌థ‌ను మ‌లుపుతిప్పే పాత్ర‌లోనూ దర్శనమిచ్చాడు. తమిళ చిత్రం ‘ఖుషి’కి రీమేక్‌గా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించాడు.

Team TFNవాట్సాప్

షేర్